Leading News Portal in Telugu

Vellampalli Srinivas: ఆర్థికంగా ఏపీ బలోపేతం కావడానికి కారణం సీఎం జగనే..


Vellampalli Srinivas: ఆర్థికంగా ఏపీ బలోపేతం కావడానికి కారణం సీఎం జగనే..

రేపటి నుండి ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆర్దికంగా ఏపీ బలోపేతం అవడానికి కారణం సీఎం జగన్.. జగన్ సీఎం కాకముందు తలసరి ఆదాయంలో ఏపి చాలా వెనుకబడి ఉంది.. వ్యవసాయ, పరిశ్రమ రంగంలో జగన్ హయాంలో ఏపీ చాలా ముందజలో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్దులు విదేశాల్లో తమ ప్రతిభ చూపించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత జగన్ ది.. ఆరోగ్య సురక్ష ద్వారా 3.79 కోట్ల మందికి ఇంటికే డాక్టర్లు తీసుకెళ్లి వైద్య పరిక్షలు చేయించిన ఘనత జగన్ దే.. రైతు భరోసా, హెల్త్ క్లీనిక్స్, సచివాలయాలు నిర్మించింది జగనే అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 30 లక్షల మంది పేదవారికి ఇళ్లపట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించి‌ ఘనత జగన్ దే.. ఐదేళ్లలోనే ఇంత అభివృద్ధి చేస్తే మరోసారి సీయం అయితే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుంది.. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ ప్రోగ్రామ్ చేపడుతు‌న్నామన్నారు.

ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్డబోతున్నామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 20 అంశాలను ప్రజలముందు పెట్టబోతున్నాం.. చంద్రబాబు పాలనకి జగన్ పరిపాలను తేడా ఏంటో ప్రజలకు వివరిస్తాం.. జగన్ చేపడుతున్న రిఫామ్స్ ను ఎంతోమంది పొగుతున్నారు.. ఏపీలో పేదరికం తగ్గించిన ఘనత సీయం జగన్ ది అని ఆయన పేర్కొన్నారు. అవినీతిని సమూలంగా పారద్రోలిన వ్యవస్ద సచివాలయ వ్యవస్థ.. ఆర్బీకే సెంటర్స్ గురించి మేధావులు సైతం గొప్పగా కొనియాడారు.. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రాత్మక అవసరం అని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.

రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అని వైసిపీ తూర్పు ఇన్చార్జ్ దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. నాలుగున్నరేళ్ల సమయంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నామన్నారు. రాష్ట్రప్రజలు ముక్తకంఠంతో జగన్ మళ్లీ సీయం కావాలని కోరుకుంటున్నారు‌.. టీడీపీ, జనసేనకు మాత్రమే జగన్ పాలన నచ్చడంలేదు.. జగన్ మళ్లీ సీఎం రావడం కావడం కోసం ప్రజలతో పాటు మేము కూడా జగన్ సైనికుల్లాగా పనిచేస్తామని దేవినేని అవినాష్ వెల్లడించారు.