Leading News Portal in Telugu

Delhi: ఢిల్లీ పాఠశాలలకు సెలవులు పొడిగింపు.. నవంబర్ 9 నుండి 18 వరకు మూత


Delhi: ఢిల్లీ పాఠశాలలకు సెలవులు పొడిగింపు.. నవంబర్ 9 నుండి 18 వరకు మూత

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో 5వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. కాలుష్యం స్థాయి నిరంతరం పెరుగుతోందని అందువల్ల 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు నవంబర్ 18 వరకు మూసివేయబడతాయని ఆయన తెలిపారు. అదే సమయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులకు అవకాశం కల్పిస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. ఢిల్లీలో ఏక్యూఐ 900 దాటింది. ఇది తీవ్రమైన కేటగిరీలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు పాఠశాలలకు ముందస్తు శీతాకాల సెలవులను ప్రకటించింది.

డిసెంబరులో సెలవులు వచ్చేవి
ఢిల్లీ పాఠశాలల్లో సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో శీతాకాల సెలవులు ప్రకటిస్తారు. ఈసారి కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం త్వరలో పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. కొత్త నోటీసు ప్రకారం, ఢిల్లీలోని అన్ని పాఠశాలలు 18 నవంబర్ 2023 వరకు మూసివేయబడతాయి.