Leading News Portal in Telugu

CID Chief Sanjay: సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు.. వారి ఆస్తులు అటాచ్‌..!


CID Chief Sanjay: సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు.. వారి ఆస్తులు అటాచ్‌..!

CID Chief Sanjay: సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత ఎవరైనా.. ఏదైనా పోస్టు పెట్టొచ్చు.. ఇష్టం వచ్చిన రాతులు రాయొచ్చు అనే పరిస్థితి తయారైంది.. అయితే, కొందరు తెలిసో తెలియక అసభ్యకరమైన పోస్టులు పెట్టి.. కొన్ని షేర్‌ చేసి కూడా చిక్కులు పడుతున్నారు.. ఇక, ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలను టార్గెట్‌ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. కొందరు కొత్త ఖాతాలను సృష్టించి సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్నారు.. మరికొందరు ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగ జీవితాలను సైతం కించపరిచేలా విధంగా పోస్టులు చేస్తున్నారు. అయితే, వారిని గుర్తించే పనిలో పడిపోయారు పోలీసులు.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌.. వీరిపై నిఘా పెట్టాం.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించాం.. వీరి ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలపైనే కాకుండా.. ప్రతిపక్ష నేతలపై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై కూడా చర్యలు తీసుకుని పోస్టులు తొలగించాం అని తెలిపారు సంజయ్‌.. ఇటీవల న్యాయ వ్యవస్థని కించ పరిచే విధంగా కూడా పోస్టులు పెట్టారని గుర్తుచేశారు. వీరిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రళహరి, వైసీపీ మొగుడు అనే అకౌంట్స్ గుర్తించాం.. ఇతర దేశాల నుంచి అసభ్య పోస్టులు వారిని ఎంబసీ వాళ్లతో మాట్లాడి
చర్యలు చేపట్టాం అన్నారు. ఇప్పటి వరకు ఇలా చేసిన నలుగురిపై చర్యలు తీసుకున్నాం.. సోషల్ మీడియా నుంచి అసభ్య పోస్టులు పెట్టే వారు నగరం నుంచి గ్రామ స్థాయికి చేరిందన్నారు. 202 సోషల్ మీడియా అకౌంట్స్ ను మోనటరింగ్ చేస్తున్నాం.. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ ను గుర్తించాం.. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేశామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌.