Leading News Portal in Telugu

Bandla Ganesh: కాంగ్రెస్ ప్రభంజనం మొదలైంది.. ప్రజలు డిసైడ్ అయ్యారు..


Bandla Ganesh: కాంగ్రెస్ ప్రభంజనం మొదలైంది.. ప్రజలు డిసైడ్ అయ్యారు..

Bandla Ganesh: ఎక్కడ పోయినా కాంగ్రెస్ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు డిసైడ్ అయ్యారని.. అందరూ డిసెంబర్ 3 కోసం వెయిటింగ్ అంటూ పేర్కొన్నారు. ఎవరు ఏం ఇచ్చినా.. కాంగ్రెస్‌కి ఓటేస్తారని ఆయన అన్నారు. రేవంత్ నాయకత్వంలో, సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ దూసుకుపోతుందన్నారు. బుల్లెట్‌లా రేవంత్ దూసుకుపోతున్నారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

దేశం కోసం రాజీవ్ గాంధీ బాడీ ముక్కలైందని.. రాజీవ్ బాడీ ముక్కలు ఏరుకుని.. స్మశానానికి రాహుల్‌ వెళ్లారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కల కోసం కాంగ్రెస్‌ని గెలిపించాలని ప్రజలకు సూచించారు. రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ ఎప్పుడూ హద్దు దాటలేదన్నారు. ఎప్పుడైనా ఏకవచనంతో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎవడు అని అడుగుతున్నారని.. అహంకారంతో మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నా శ్వాస కాంగ్రెస్.. నా మాట కాంగ్రెస్ అంటూ బండ్ల గణేష్ అన్నారు. అయ్యప్ప మాలతో చెప్తున్నా.. కాంగ్రెస్ తెలంగాణను ఏలాలన్నారు. తాను కాంగ్రెస్ వ్యక్తిగా గర్వపడుతానని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.