Leading News Portal in Telugu

Balineni Srinivasa Reddy: నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..


Balineni Srinivasa Reddy: నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..

బకింగ్ హాం కెనాల్ మీద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బ్రిడ్జి నిర్మాణం కోసం నేను పర్సంటేజ్ లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతలకు దమ్ము, దైర్యం ఉంటే దేవుని ముందు ప్రమాణం చేసేందుకు రావాలి అని ఆయన సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించిన ఆ కాంట్రాక్టర్ ఎవరో కూడా నాకు తెలియదు.. నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవటంతో నిధులు వెనక్కు వెళ్లాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు డబ్బులు మీరు తీసుకుని నాపై ఆరోపణలు చేయటం సరికాదు.. ప్రమాణం చేయటానికి నేను సిద్ధం.. ప్రజలు ఇబ్బందులు చూడలేక నా సొంత పూచీకత్తుపై 40 లక్షల రూపాయల మెటీరియల్ ఇప్పించాను అని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవాలు తెలుసుకుని దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ లు మాట్లాడాలి అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు నాపై ఆరోపణలు చేస్తే మంచిగా ఉందని మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారం చేయడానికి మీకు సిగ్గు ఉండాలి అంటూ బాలినేని అన్నారు.