Leading News Portal in Telugu

అవును.. వై ఏపీ నీడ్స్ జగన్! | why ap needs jagan| ycp| programme| people| question| cases


posted on Nov 9, 2023 6:26AM

కదిలితే కేసు.. మెదిలితే అరెస్టు.. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి ఇది. నిత్యంనరకం అనుభవిస్తున్నా.. నోరెత్తితే కటకటాల పాలు చేస్తారన్న భయంలో జనంబతుకుతున్నారు. అలా భయపెట్టి.. జనాలను భయంలోనే ఉంచి.. వచ్చేఎన్నికలలో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేయవచ్చని కలలు కంటోందిజగన్ పార్టీ. అయితే.. సర్వేలైతేనేం, ఎక్కడికక్కడ జనంతిరగబడుతుండటంతో.. కేవలం బెదరింపులతో పని కాదని అర్దమైన అధికారపార్టీ అగ్రనాయకత్వానికి.. అధికారంపై ఆశలు అడుగంటాయి. ఇక గోబెల్స్ నేనమ్ముకున్నారు. అందుకే..   అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నానికి ఒడిగట్టారు. ఏపీలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు.ఇందు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను ఇంటింటికీ, గడపగడపకీ,వీధి వీధికీ పంపుతున్నారు. ఏపీ ప్రజలు జగన్ హయాంలో జరిగినఅభివృద్ధిని చూడలేకపోతున్నారనీ, కానీ ప్రపంచం మొత్తం ఏపీవైపుచూస్తోందనీ చెప్పుకుంటున్నారు.  వాస్తవానికి  పేద, మధ్య తరగతి, మేధావులే కాదు గత ఎన్నికల్లో ఏదో ఆశించి, వైసీపీకి ఓటేసి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా.. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికలలో చేసిన తప్పును దిద్దుకోవాలని పట్టుదలగా ఉన్నారు.  ఎంత త్వరగా ఎన్నికలొస్తే రాష్ట్రానికి అంత మంచిదని భావిస్తున్నారు.  అంతే కాదు  చివరకు క్షేత్ర స్థాయి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా బహిరంగంగా కాకపోయినా, అంతర్గత సంభాషణల్లో ఈ సారి మన పని అయిపోయినట్లేనని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. సామాజిక సాధికార బస్సుయాత్రకు కార్యకర్తలు ముఖం చాటేయడమే ఇందుకు  నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా, ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో చంద్రబాబు అంతటి  సీనియర్ నాయకుని, అక్రమంగా, అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్న తీరును,పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలా తీవ్రంగా   వ్యతిరేకిస్తున్నారు. చట్టాని చుట్టేసి, ఇష్టారాజ్యంగా రాజ్యంగ విరుద్ధ పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలించుకోవచ్చనే ఆలోచన సర్వట్రా వ్యక్తమవుతోంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వైసీపీ మంత్రులు, నాయకులు చేస్తున్న ప్రకటనలతో జనంలో ఇప్పటికే జగన్ సర్కార్ పట్ల ఉన్న వ్యతిరేకత మరింత పెరిగింది. గతంలోలా వ్యతిరేకతను మనసులో ఉంచుకుని మౌనంగా ఉండటం కాకుండా ఆ వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. కేసులు, అరెస్టులపై భయాన్ని వదిలేశారు.  నిజాన్ని సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత రాష్ట్రంలో  పరిస్థితులపై సి ఓటర్ నిర్వహించిన సర్వేలో   చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని తేలింది.

చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని, ఈ అరెస్ట్‌తో జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందని సి ఓటర్ సర్వే తేల్చింది. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం తథ్యమని వెల్లడించింది. జనసేన పొత్తుతో చంద్రబాబు మరోమారు, ముఖ్యమంత్రిగా సభలో కలుపెట్టడం ఖాయమని సర్వే తేల్చింది. ఆయన అరెస్ట్ తో తెలుగు దేశం పార్టీకి, పెద్దగా నష్టం జరగదని వైసీపీ నేతలే అభిప్రయా పడుతున్నారని పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెపుతే వినే రకం కాదు కాబట్టి, వాస్తవ పరిస్థితిని వారు ఆయన ముందు ఉంచలేకపోతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు.  ఇప్పటికే వైసీపే నాయకులు ఓటమికి మానసికంగా సిద్దం అయిపోయారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   

ఈ నేపథ్యంలో జనం అంటున్న వై ఏపీ నీడ్స్ జగన్ అంటున్న మాటనే కార్యక్రమంగా మార్చి ఏపీకి జగనే ఎందుకు అవసరమో వివరించేందుకు వైసీపీ నేతలను జగన్ మరోసారి జనం ముందుకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఏపీలో జరిగిన, జరుగుతున్న బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రపంచం అంతా గుర్తించినా రాష్ట్ర ప్రజలు మాత్రం చూడలేకపోతున్నారని తెగ బాధపడిపోయారు. అసలు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మించిన అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో గురువారం(నవంబర్9) నుంచి జగన్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. జగన్ చేసిన అభివృద్ధిని చూడలేకపోవడం జనం తప్పే అని తేల్చేశారు. తప్పు అన్నట్లు సజ్జల మాట్లాడారు. ఇంత అభివృద్ధి చేసినా ఎక్కడుంది అభివృద్ధి అన్నట్లు విమర్శలు చేస్తుంటే కేసులు పెట్టమా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.   అసలు వైసీపీ కార్యక్రమాలన్నీ పోలీసులను అడ్డం పెట్టుకుని జనాలను బెదరించడానికే అన్నట్లు ఉంటున్నాయని ఇప్పటికే విమర్శలు

వెల్లువెత్తుతున్నాయి.

గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన తెలిపిన వారిపై కేసులు, పథకాలు ఆపేస్తామన్న బెదరింపులను పరిశీలకులు ఉదాహరణగా చూపిస్తున్నారు.  ఇంటింటికీ తిరిగి  మా నమకం, మా భవిష్యత్‌ నువ్వే జగన్  స్టిక్కర్స్ అంటించారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులు వేసుకొని తిరిగారు. ఇంత చేసిన తరువాత  కూడా ఇప్పుడు ఏపీకి జగన్ ఎందుకు (వై ఏపీ నీడ్స్ జగన్) అని జనం ప్రశ్నిస్తున్నారు. అదే వైసీపీకి మింగుడు పడటం లేదు. దీంతో వారు వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఓ కార్యక్రమాన్ని మొదలెట్టేశారు. ఇక జనానికి కనిపించని అభివృద్ధి గురించి ఉదరగొట్టేస్తారు. బటన్ నొక్కడం కంటే అభివృద్ధి ఏముంటుందని జనానికి చెప్పేందుకు రెడీ అయిపోయారు. రోడ్లు ఎందుకు బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తుంటే ఇక రోడ్లు ఎందుకు అని చెప్తారు. ధరలు ఎంత విపరీతంగా పెరిగినా బాధెందుకు మీకు సొమ్ములు ఇస్తున్నాం కదా అంటారు. విద్యుత్ చార్జీలు పెరిగితే ఏమైంది.. మీఖాతాలలో సొమ్ములు పడుతున్నాయిగా అని చెప్పుకుంటారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేకపోతోంది కదా అంటే వారు మా ఓటర్లు కాదని అంటారేమో. ఎందుకంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తరువాత ఇదే సజ్జల గారు మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర ఆర్ధిక, పారిశ్రామిక, ఐ‌టి. వ్యవసాయ, సాగునీటి రంగాలలో అభివృద్ధి అడుగంటిపోయిన సంగతి, కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దయనీయ పరిస్థితి గురించి జనం అడిగితే వాటి సంగతి మీ కెందుకు మీకు జగన్ బటన్ నొక్కి సొమ్ములను ఖాతాలలో వేస్తున్నారుగా.. అందుకే ఏపీ నీడ్స్ జగన్ అని చెబుతారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పదే పదే మందీ మార్బలంతో అధికార పార్టీ నేతలు జనం ఇళ్ల మీద పడి బెదరించి, భయభ్రాంతులకు గురి చేసి దట్స్ వై ఏపీ నీడ్స్ జగన్ అంటారేమో అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది.