
YSRCP Samajika Sadhikara Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్‌గా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తోంది.. అయితే, రేపటితో వైసీపీ మొదటి దశ సామాజిక సాధికార బస్సు యాత్ర ముగియనుంది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలతో సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తోంది వైసీపీ.. గత నెల 26వ తేదీన బస్సు యాత్ర ప్రారంభమైంది.. 39 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర సాగింది.. ఈ యాత్రలో భాగంగా నాలుగున్నర సంవత్సరాలలో సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ వచ్చారు రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చట్ట సభల్లో సీట్లు నుంచి స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల వరకూ అన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని అందించారని వివరిస్తూ వస్తున్నారు నేతలు. మరోవైపు.. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండో దశ బస్సు యాత్ర ప్రారంభించనుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 15 రోజుల్లో 40 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా సామాజిక సాధికార బస్సు యాత్రను ప్లాన్ చేస్తున్నారు నేతలు.. తొలి విడతలాగే.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో మూడు దశల్లో ఈ యాత్ర జరగనుంది.