posted on Nov 9, 2023 11:30AM
ఓటమి భయంతో రెండు చోట్ల పోటి చేస్తున్న ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం మధ్యాహ్నం(నవంబర్ 9 ) స్వంత నియోజకవర్గం గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం ఇదో మూడోసారి. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ కు కేసీఆర్ హెలికాప్టర్ లో వెళ్లారు. కెసీఆర్ ను ఎలాగైనా ఓడించి తీరుతానని శపథం చేసిన బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వెళ్లిన ఈటెల ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గజ్వేల్ నుంచి కామారెడ్డికి కేసీఆర్ బయల్దేరారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అక్కడ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.