Leading News Portal in Telugu

Akkineni Amala: ఆయన తెలుగు సినిమాకు ఒక పిల్లర్..


Akkineni Amala: ఆయన తెలుగు సినిమాకు ఒక పిల్లర్..

Akkineni Amala: అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున భార్యగా.. అఖిల్, చైతన్యకు తల్లిగా.. అక్కినేని కోడలిగా.. ఇక జంతు సంరక్షకురాలిగా అమల ఎన్నో పాత్రలను పోషిస్తుంది. ఇక అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తున్న అమల తాజాగా కె విశ్వనాథ్ గారి స్మారక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ స్క్రీనింగ్ ఈవెంట్ లో పాల్గొంది. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్, మంజు భార్గవి, అమల తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది కె విశ్వనాథ్ మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయనను స్మరించుకుంటూ ఇండికా ఫిలింస్‌ ఈ కాంటెస్ట్ ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ స్క్రీనింగ్ మరియు విజేతల ప్రకటన అనంతరం అక్కినేని అమల మాట్లాడింది.

The Trail: థియేటర్ లోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వస్తుందిరోయ్..

“విశ్వనాథ్‌ గారి మెమోరియల్‌ షాట్‌ ఫిల్మ్ కాంటెస్ట్‌ను ఇండికా ఫిలింస్‌ ఆర్గనైజింగ్‌ చేయడం ఆనందంగా వుంది. యంగర్‌ జనరేషన్‌కు స్పూర్తిగా వుంది. మా మామగారు నాగేశ్వరరావుగారితో విశ్వనాథ్‌గారికి మంచి స్నేహ సంబంధాలు వుండేవి. నేను చిన్నతనంలోగా ఉండగా.. శంకరాభరణం చూశాను. నేను భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. తెలుగు సినమాకు ఒక పిల్లర్ గా విశ్వనాథ్‌ గారు నిలిచారు. ఆర్ట్‌, కల్చర్‌, డాన్స్‌, మ్యూజిక్‌ అన్నీ కలగలిపిన దర్శకుడు ఆయన. ఈరోజు నేను చూసిన లఘుచిత్రాలు మంచి కథలతో వున్నాయి. అరవింద్‌గారు ఇప్పటి ఫిల్మ్ మేకర్స్ స్పూర్తిగా నిలిచారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.