
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై నేడు ( గురువారం ) సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇవాళ కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్ లో ఉంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ కేసును జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించనుంది. కాగా.. 17- ఏ పై చంద్రబాబు దాఖలు చేసిన పిల్ పై తీర్పు పెండింగ్‌లో ఉంది. ఇక, నేడు లేదా రేపు 17 ఏ చంద్రబాబుకు వర్తింపుపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 17 ఏపై కేసులో తీర్పు పెండింగ్ నేపథ్యంలో పైబర్ నెట్ కేసును గతంలో ఇవాళ్టికి జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అయితే, చంద్రబాబును 17-ఎ కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ఫైబర్‌నెట్ కేసులో అరెస్టు చేయడం కానీ, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయొద్దని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక, ధర్మాసనం గతంలో చెప్పినట్లు 17-ఏ కేసులో ఇప్పటి వరకు తీర్పును వెల్లడించలేదు. ఇవాళ్టి జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు.. అందువల్ల నేడు ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెల్లడిస్తారా?.. లేదంటే 17-ఎ కేసులో తీర్పు ఇచ్చే వరకూ ప్రస్తుతమున్న ఆదేశాలను కొనసాగిస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది.