Leading News Portal in Telugu

T.Congress : కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. మొత్తం 5 గురి పేర్లతో తుది జాబితా


T.Congress : కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. మొత్తం 5 గురి పేర్లతో తుది జాబితా

తెలంగాణలో ఎన్నికల హీట్‌ పెంచుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు బరిలో దించే అభ్యర్థుల దాదాపు విడుదల చేయగా.. తాజాగా కాంగ్రెస్ తుది జాబితా విడుదల చేసింది. మొత్తం 5 గురి పేర్లతో తుది జాబితా విడుదల చేశారు కాంగ్రెస్‌ పెద్దలు. పటాన్ చెరువు నీలం మధు స్థానం లో కట్ట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వగా.. తుంగతుర్తి మందుల సామియెల్‌కు అధిష్టానం అవకాశం కలిపించింది. అలాగే.. సూర్యాపేట రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ ముజీబ్ షరీఫ్ లకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్‌ తుది జాబితాను విడుదల చేసింది.

ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఇప్పటికే పటాన్ చెరు నియోజకవర్గం నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించిన కాంగ్రెస్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది. తుది జాబితాలో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్‌ను ఫైనల్ చేసింది. మరి దీనిపై మధు, ఆయన అనుచరులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోవైపు ఇంతకాలం తనకు టికెట్ వస్తుందని భావించిన తుంగతుర్తి నియోజకవర్గ నేత అద్దంకి దయాకర్‌కు హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో మందుల శ్యామ్యూల్‌ను ఖరారు చేసింది. దీనిపై అద్దంకి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Congress List

Congress List