
Minister Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే నేతలు హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు.. ఇక, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పరోక్ష విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. సత్తెనపల్లిలో ఈసారి ఎలాగైనా నన్ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ల తప్పులు ఎత్తి చూపిస్తాను.. కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. పార్టీలు మారిన వ్యక్తిని ఎక్కడో నుంచి తీసుకువచ్చి నాపై పోటీకి సిద్ధం చేశారంటూ కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రస్తావించకుండానే కామెంట్లు చేశారు.. ఆ వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు , తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాడు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని వ్యాఖ్యానించారు.. పార్టీలు మారే వ్యక్తిని నాపై పోటీకి సిద్ధం చేశారన్నారు. ప్రజల ఆశీస్సులు ఉండగా చంద్రబాబు కానీ, పవన్ కల్యాన్గానీ, నారా లోకేష్ గానీ.. ఇప్పుడు నాపై పోటీకి సిద్ధమైన వ్యక్తులు కానీ నన్ను ఏమీ చేయలేరన్నారు మంత్రి అంబటి రాంబాబు. కాగా, మీడియాతోనైనా.. సోషల్ మీడియాలోనైనా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజ్లో విరుచుకుపడుతోన్న విషయం విదితమే.. అదే స్థాయిలో వారి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు అంబటి రాంబాబు.