
Boys Hostel is now streaming on Etv Win: చాలా ఎదురుచూపుల అనంతరం బాయ్స్ హాస్టల్ సినిమా ఇప్పుడు OTTలో ప్రసారం అవుతోంది. కన్నడలో సూపర్ హిట్ అయినా సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ఆగస్టులో తెలుగులో ఈ సినిమాను విడుదల చేశాయి. బాయ్స్ హాస్టల్ అనే ఈ సినిమా నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన కన్నడ డార్క్ కామెడీ చిత్రం హాస్టల్ హుడుగారు బేకగిద్దరేకి తెలుగు డబ్బింగ్ వెర్షన్. కన్నడ వెర్షన్ శాండల్ వుడ్ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు, దాని తెలుగు వెర్షన్, బాయ్స్ హాస్టల్ ప్రస్తుతం OTTలో ప్రసారం అవుతోంది. ఈ బాయ్స్ హాస్టల్ సినిమా తెలుగు వెర్షన్, తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను, స్పందనను అందుకుంది.
Omegle Shutdown: లైవ్ వీడియో చాటింగ్ సైట్ Omegle షట్ డౌన్.. 14 ఏళ్ళ సేవలకు చెల్లు చీటీ
ప్రస్తుతం ఈ సినిమా OTTలో ప్రసారం అవుతోంది. ఈ సినిమా ఇప్పుడు ETV విన్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. కన్నడ వెర్షన్ ఇప్పటికే ZEE5లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో మంజునాథ్ నాయక, ప్రజ్వల్ బిపి, శ్రీవత్స శ్యామ్, గగన్ రామ్, శ్రేయాస్ శర్మ, భరత్ వశిష్ట్, తేజస్ జయన్న, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, దిగంత్ మంచాలే వంటి వారు నటించారు. పవన్ కుమార్, రమ్య, రిషబ్ శెట్టి ప్రత్యేక అతిధి పాత్రలలో నటించగా తెలుగులో తరుణ్ భాస్కర్, రష్మీలను కూడా యాడ్ చేశారు. గుల్మోహర్ ఫిల్మ్స్ – వర్రున్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.