
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. జనసేన పార్టీ పెట్టిన తరువాత తాను సినిమాల్లో నటించను అని పవన్ ఖరాకండీగా చెప్పుకొచ్చాడు. కానీ, లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ ఓడిపోయాడు. ఇక పార్టీ ఫండింగ్ కోసం ఆయన మళ్లీ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈసారి సినిమాలను ఎంచుకొనే విధానం కూడా మారింది. ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ.. సినిమాను పూర్తిచేయాలి. అందుకు సరిపడా కథలను మాత్రమే పవన్ ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఇక పవన్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమ తరువాత భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలు చేశాడు.. ఈ మూడు సినిమాలు రీమేక్ లే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ గబ్బర్ సింగ్, OG.. ఇవి కాకుండా లైన్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి.
Allu Aravind: పొలిమేర హిట్.. అల్లు అరవింద్ అభినందనలు
పార్టీని నడపడానికి నిర్మాతల దగ్గరనుంచి ముందే డబ్బు తీసుకున్న పవన్.. షూటింగ్ లో కొంచెం అటూ ఇటూగా వచ్చిన అడ్జస్ట్ అవుతున్నారు. ఆ హరిహర వీరమల్లు దాదాపు రెండేళ్లు అవుతుంది మొదలై.. ఇప్పటివరకు పూర్తికాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్.. 20 శాతం కూడా పూర్తీ అయ్యినట్లు కూడా సమాచారం లేదు. ఇక OG నే అటుఇటుగా సగం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ మూడు సినిమాలు ఫైనల్ కు వచ్చింది లేదు. అంతలోనే ఎలక్షన్స్ వచ్చేసాయి. దీంతో ఆ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు పవన్. ఇప్పుడు టోటల్ గా పవన్ ఫోకస్ అంతా ఎలక్షన్స్ మీదనే. అందుకే ఆ సినిమాలు అన్ని కట్టి కబోర్డ్ లో పడేశారని తెలుస్తోంది. మళ్లీ పవన్ వచ్చాక రీ షెడ్యూల్స్ మొదలుకానునట్లు సమాచారం. మరి పవన్ ఈసారి ఎలక్షన్స్ లో ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి.