Leading News Portal in Telugu

Jammu and Kashmir: కశ్మీర్ పోలీసులు, ఆర్మీ జాయింట్ ఆపరేషన్‌.. టిఆర్‌ఎఫ్ ఉగ్రవాది హతం..


Jammu and Kashmir: కశ్మీర్ పోలీసులు, ఆర్మీ జాయింట్ ఆపరేషన్‌.. టిఆర్‌ఎఫ్ ఉగ్రవాది హతం..

Jammu and Kashmir: బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టిఆర్‌ఎఫ్ ఉగ్రవాది హతమయ్యాడు అని అధికారులు వెల్లడించారు. వివరాలలోకి వెళ్తే.. విచక్షణారహితంగా దాడులు చేస్తూ దేశంలో శాంతి భద్రతలను ఆటంక పరిచే ఉగ్రవాదుల పైన ఇండియన్ ఆర్మీ ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరిపారేసేందకు
కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కలిసి సంయుక్తంగా బుధవారం ఎన్‌కౌంటర్‌ ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదికి.. ఉగ్రవాద సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలానే అతని దగ్గర ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా నేరాలకు పాల్పడేందుకు కావాల్సిన అన్ని వస్తువులు అతని వద్ద గుర్తించారు అధికారులు.

Read also:Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై నాసా రియాక్షన్.. గాలి కాలుష్యంపై ఫోటోలు రిలీజ్!

ఉగ్రవాదిని హతమార్చిన పోలీసులు, ఆర్మీ.. అనంతరం ఉగ్రవాది దగ్గర ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా నేరాలకు పాల్పడేందుకు కావాల్సిన అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కాశ్మీర్ జోన్ పోలీసులు X (దీనిని గతంలో ట్విటర్‌గా పిలిచేవారు. ) వేదికగా ఈ ఎన్కౌంటర్ గురించి వన్ లైన్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అలానే బుధవారం X వేదికగా షోపియన్‌ లోని కతోహలన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని. పోలీసులు, సైన్యం కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. కాగా బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యారు అనే వార్తను గురువారం X వేదికగా తెలియచేసారు.