Leading News Portal in Telugu

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. విద్యుదాఘాతంతో నలుగురు మృతి



Untitled 1

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గురువారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రం లోని సలాంబర్ జిల్లా లోని లసాదియా ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read also:Telangana Assembly Elections 2023: సెలబ్రిటీలను పక్కనబెట్టిన బీజేపీ.. వద్దుమొర్రో అన్న వ్యక్తికి టికెట్..!

ఈ నేపథ్యంలో సలాంబర్‌ డీఎస్పీ దుంగార్‌సింగ్‌ మాట్లాడుతూ.. బోడ్ ఫల్లాలో నివాసముంటున్న ఉంకర్ మీనా ఇంట్లో విషాదం నెలకొందని.. ఇంటి సమీపం లోని విద్యుత్ స్తంభంలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని.. అది ఇంటి ఇనుప గేటు వైర్‌కు తాకిందని.. దీనితో 68 ఏళ్ల ఉంకర్ మీనా , అతని భార్య భన్వారీ (65) కూడా విద్యుదాఘాతానికి గురైయ్యారని, తల్లిదండ్రులను రక్షించడానికి ప్రయత్నించిన అతని 25 ఏళ్ల కుమారుడు దేవి లాల్ అలానే అతని 22 ఏళ్ల (వివాహిత) కుమార్తె కూడా విద్యుదాఘాతానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ షాక్‌తో నలుగురు మృతి
చెందినట్లు ఆయన తెలిపారు.

Read also:Semifinal CWC 2023: వన్డే ప్రపంచకప్‌ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?

కాగా ఈ ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు అతనికి సమాచారం అందించారని. అనంతరం పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించామని, నలుగురి మృతదేహాలను ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపిన ఆయన..శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగింస్తామని తెలిపారు. కాగా కూన్ పోలీస్ అధికారి ప్రవీణ్ సింగ్ శక్తావత్ తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అలానే సలాంబర్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రతాప్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన గురించి సమాచారం అందుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కన్హయ్యలాల్ మీనా, స్థానిక సర్పంచ్ పూంచ్ చాంద్ మీనా కూడా ఘటన స్థలాన్ని సందర్శించారు.