Leading News Portal in Telugu

India-USA: ప్రధాని మోడీతో యూఎస్ రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీ..



Pm Modi

India-USA: భారత్, అమెరికా మధ్య ఈ రోజు ఇరు దేశాల 2+2 మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేలా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.

Read Also: Election Campaign: ఎన్నికల ప్రచారంలో అపశృతి.. 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు

ఈ సమావేశం అనంతరం అమెరికా మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ కూడా పాల్గొన్నారు. భారతదేశం-అమెరికా భాగస్వామ్యం నిజంగా ప్రపంచ ప్రయోజనాల కోసం ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మంత్రుల సమావేశం జరిగిందని ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు.

అంతకుముందు జరిగిన మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు కూడా మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని గురించి చర్చించారు. ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభం గురించి మాట్లాడారు. భారత్-అమెరికాల మధ్య రక్షణ సహకారంలో భాగంగా సంయుక్తంగా పదాతిదళ పోరాట వాహనాలు తయారు చేయనున్నట్లు యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. మరోవైపు చైనా దూకుడు కళ్లెం వేయడానికి ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై మంత్రులు చర్చించారు.