Leading News Portal in Telugu

Revanth Reddy : అలా చెబితే హరీష్‌ రావు ఉదయానికల్లా జైల్లో ఉంటారు



Revanth

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్‌ అవర్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ధీమానే నా ధీమా అని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. కేసీఆర్‌ తన సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దాలని చూశారన్నారు. తెలంగాణలో అనుకున్నస్థాయిలో అభివృద్ధి లేదని, తెలంగాణలో స్వేచ్ఛ లేదు, మళ్లీ అదే ఆధిపత్యం కొనసాగుతోంది. సమైక్యపాలనలో ఉన్నట్లే ఇప్పుడు తెలంగాణలో ఆధిపత్యం నడుస్తోంది. ప్రజాపాలన కోసమే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Election Campaign: ఎన్నికల ప్రచారంలో అపశృతి.. 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు

అంతేకాకుండా.. ‘ సోషల్‌ మీడియాలో చిన్నపోస్ట్‌ పెడితే అర్థరాత్రి ఎత్తుకెళ్లి జైల్లో పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఉందా..? నేను కేసీఆర్‌ భాషలోనే మాట్లాడుతున్నాను. ఈ భాషను పితామహుడే కేసీఆర్‌. తెలంగాణలో స్వేచ్ఛలేదు, మళ్లీ అదే ఆధిపత్యం కొనసాగుతోంది. సమైక్యపాలనలో ఉన్నట్లే ఇప్పుడు తెలంగాణలో ఆధిపత్యం నడుస్తోంది. కుటుంబ పాలన పోవాలి, ప్రజా పాలన రావాలి. కేసీఆర్‌ తన సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దాలని చూశారు. తెలంగాణ సామాజిక న్యాయం లేదు. ఈ గులాబీలు ఢిల్లీ గులాములు. కేటీఆర్‌ అక్రమాలపై ఆధారాలు బయటపెడితే కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. కేటీఆర్‌ పోటీలో లేడు, చర్చలో లేడు. తండ్రి సంపాదించి పెట్టిన అధికారాన్ని అనుభవిస్తున్నాడు. ధర్నా చౌక్‌ను ఎందుకు ఎత్తేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలో ఎంపీలు, ఎమ్మె్ల్యేలకు ఎందుకు అనుమతి లేదు.’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Also Read : Bandi Sanjay : బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి