Leading News Portal in Telugu

Anchor Suma: తలుపు తీయకపోతే.. రాత్రంతా మెట్లపై నిద్రపోయేది..



Suma

Anchor Suma: స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర వెండితెర అని తేడా లేకుండా సుమ రెండిటినీ ఏలేస్తుంది. ఒకపక్క బుల్లితెరపై షోస్ చేస్తూనే ఇంకొకపక్క స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇవి కాకుండా తన సొంత యూట్యూబ్ ను సైతం హ్యాండిల్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా సుమ అలుపెరుగని పోరాటం చేస్తుంది. ఇప్పటివరకు ఏ యాంకర్ ఇంతలా పాపులారిటీని తెచ్చుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ప్రస్తుతం సుమ తన కొడుకు రోషన్ ను హీరోగా నిలబెట్టే పనిలో పడింది. రోషన్ కనకాల బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.

Extra – Ordinary Man: బ్రష్ వేసుకో.. మైండ్ ను రిప్రెష్ చేసుకో

ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో రోషన్ తో పాటు సుమ కూడా పాల్గొంటుంది. తాజాగా ఒక ఛానెల్ లో నిర్వహించిన దీపావళి ఈవెంట్ లో తల్లి కొడుకులిద్దరూ సందడి చేశారు. ఇక ఈ వేదికపై సుమ ఒకప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపిందో యాంకర్ శిల్పా చక్రవర్తి చెప్పుకురావడం హైలైట్ గా నిలిచింది. ఒకానొక సమయంలో ఈవెంట్స్ చేసి అర్ధరాత్రి లేటుగా ఇంటికి వస్తే తలుపు ఎవరూ తీయకపోవడంతో కొన్నిసార్లు రాత్రుళ్లు మెట్లపైనే నిద్రపోయేదని శిల్పా చెప్పకొచ్చింది. అంతలా ఆమె కష్టపడిందని శిల్పా తెలిపింది. ఇక ఆ మాటలు విన్న సుమ ఎమోషనల్ అయ్యింది. ఇక తల్లి ఎమోషనల్ అవ్వడం చూసిన రోషన్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ళు సుమ కష్టపడిందని ఈ ఒక్క ఉదాహరణ నిరూపిస్తుంది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.