Leading News Portal in Telugu

టీటీడీ ఎల్ ఏ సి సభ్యుడిగా నిర్మాత శ్రీ మోహన్ ముళ్ళపూడి నియామకం | producer mohan mullapudi appointed as ttd lac member| himayatnagar| jublee| karimnagar| balaji


posted on Nov 11, 2023 1:34PM

తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వయిజరీ కమిటీ (ఎల్ఏసీ) సభ్యుడిగా ప్రముఖ నిర్మాత మోహన్ ముళ్లపూడి నియమితులయ్యారు. ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా  ఈ నియామకం  జరిగింది. ఈ మేరకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  ఉత్తర్వులు జారీ చేశారు. ఆ

ఉత్తర్వుల మేరకు    వేంకటేశ్వరస్వామి ఆలయాల జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా  మోహన్ ముళ్ళపూడి  ఉంటారు. ఈయన గతంలో పలు సినిమాలకు నిర్మాతగా ,  డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు(ఎఫ్ఎన్ సీసీ)  గౌరవ కార్యదర్శిగా ఉన్నారు.

 ప్రస్తుతం  వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్‌ లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధి విషయంలోనూ,  కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనులలో లోకల్ అడ్వైజరి కమిటీ మెంబర్ గా  బాధ్యతలను నిర్వహిస్తారు.