Leading News Portal in Telugu

Traffic: ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్..



Delhi Traffic

ఢిల్లీ- గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. దీపావళి పండగ సందర్భంగా నగర వాసులు సొంత ఇళ్లకు బయలు దేరడంతో ట్రాఫిక్ భారీగా పెరిగింది. గంటల కొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, గంటకు టోల్ ప్లాజా సమీపంలో ట్రాఫిక్ జామ్ లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. ట్రాఫిక్‌ను దాటుకుని పేషంట్ ను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చడానికి అంబులెన్స్ ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అయ్యింది.

Read Also: CM YS Jagna Vijayawada Tour: కాసేపట్లో విజయవాడకు సీఎం జగన్‌

అయితే, ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పై ఎనిమిది లైన్‌ల రోడ్డు ఉంది. అయినా కూడా, ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌ జరుగుతూనే ఉంది. నిన్న ధన్‌తేరస్‌ రద్దీ కారణంగా పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రజలు షాపింగ్ చేయడానికి, బంధువులను కలవడానికి బయలుదేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటరుకు పైగా జామ్‌ ఏర్పడడంతో వాహనాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. ధన్‌తేరస్‌తో పాటు ఆదివారం దీపావళి సందర్భంగా భారీగా ట్రాఫిక్‌ ఏర్పాడిందని పోలీసులు తెలిపారు.

Read Also: Ranveer Singh: ముంబైలోని రెండు అపార్ట్ మెంట్లను అమ్మిన రణవీర్.. కళ్లు చెదిరే డీల్

దీపావళికి ముందు నగర రోడ్లపై ముఖ్యంగా షాపింగ్ మాల్స్ చుట్టూ, చాందినీ చౌక్, ఖారీ బావోలి, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సరోజినీ నగర్, సదర్ బజార్, సెంట్రల్ మార్కెట్ లజ్‌పత్ నగర్‌తో సహా రద్దీగా ఉండే అధిక ఫుట్‌ఫాల్ మార్కెట్ ప్రాంతాల చుట్టూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. నెహ్రూ ప్లేస్, గ్రేటర్ కైలాష్, తిలక్ నగర్, గాంధీ నగర్, కమలా నగర్, రాజౌరి గార్డెన్ ఏరియాల్లో వాహనాల రద్దు ఎక్కువగా ఉందన్నారు.

Read Also: India-America: ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన భారత్-అమెరికా

సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేయడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, బస్సు, మెట్రో, కార్‌పూల్ వంటి ప్రజా రవాణా సేవలను ఉపయోగించుకోవాలని సాధారణ ప్రజలకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ హెల్ప్‌లైన్ సోషల్ మీడియా సేవలతో అనుసంధానం చేయడం ద్వారా తదనుగుణంగా అవాంతరాలు లేని ప్రయాణానికి మరింత సహాయపడుతుంది అని వారు పేర్కొన్నారు.