Leading News Portal in Telugu

Road Accident: నడుచుకుంటూ వెళుతున్న వారిపై దూసుకెళ్లిన బొలెరో.. ముగ్గురు మృతి!



Anantapur Road Accident

3 Killed in Anantapur Road Accident: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై ఓ బొలెరో క్యాంపర్ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద బొలెరో క్యాంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై బొలెరో దూసుకెళ్లింది. అంతేకాదు ఎదురుగా వస్తున్న మరో కారును కూడా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పాదచారులు ముగ్గరు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Also Read: IND vs NED: నేడు నెదర్లాండ్స్‌తో భారత్‌ ఢీ.. తుది జట్టులో రెండు మార్పులు?

బొలెరో క్యాంపర్ వాహనం బీభత్సంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పంపనూరు జాతీయ రోడ్డుపై బ్తెఠాయించి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరుపుతున్నారు. బొలెరో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.