Leading News Portal in Telugu

Vijayasai Reddy: పురంధేశ్వరి ‘సెలెక్టివ్‌ అటెన్షన్‌’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు..



Vijayasai Reddy

Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదిగా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

 

Also Read: Harish Rao: ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌ చేసింది కాంగ్రెస్‌ కాదా?

“అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు.” అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.