Leading News Portal in Telugu

Team India Diwali Celebrations: దీపావళి సంబరాలు జరుపుకున్న టీమిండియా ఆటగాళ్లు.. వీడియో చూశారా..!



Diwali

దేశం మొత్తం దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగానే దీపావళి సంబరాలను టీమిండియా ఆటగాళ్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు జరిగే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కు ముందే బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ లో జరుపుకున్నారు. ఈ వేడుకలో టీమిండియా సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఆనందంగా గడిపారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వారి ఫ్యామిలీలతో హాజరయ్యారు. టీమిండియా దివాళీ సెలబ్రేషన్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. పలువురు నెటిజన్లు తమ కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు రెండు కళ్లు చాలవని అంటున్నారు.

Read Also: Diwali 2023: పర్యావరణానికి హాని కలగకుండా ఈ సారి దీపావళిని ఈ విధంగా జరుపుకోండి..

దీపావళి వేడుకల్లో విరాట్‌-అనుష్క దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాకుండా.. ఈ వేడుకల్లో రోహిత్‌, కేల్‌ రాహుల్‌, జడేజా, శార్దూల్‌, సూర్యకుమార్‌ సతీసమేతంగా హాజరయ్యారు. మరోవైపు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఎప్పటిలానే చిన్న పిల్లాలలా సందడి చేశారు.

Read Also: Ayodhya Deepotsav: ‘‘ అద్భుతం.. మరుపురానిది’’.. అయోధ్య దీపోత్సవంపై ప్రధాని ట్వీట్..

ఇదిలా ఉంటే.. ఈరోజు నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ 410 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు సాధించారు. 411 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. ఈ వార్త రాసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.