Jagga Reddy Interview: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు?.. సీనియర్ నేత జగ్గారెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Jagga Reddy Interview: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హంగామా కొనసాగుతోంది. అధికార, విపక్షాలు ఎవరి వారే రాబోయేది తమ ప్రభుత్వమేననే ధీమాలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసారి దూకుడు పెంచింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు ఈసారి సీట్లు పెరిగే అకాశముందని సర్వేలు చెప్పడంతో కాంగ్రెస్‌లో సీఎం పదవిపై పలువురు నేతలు కన్నేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి అని ధీమా వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. ఈ సారి కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. రేవంత్, తనకు మధ్య జరిగిన గొడవలు అన్నదమ్ములకు మధ్య జరిగే గొడవల్లాంటివని పేర్కొన్నారు. దామోదర రాజనర్సింహ, తనకు మధ్య జరిగిన గొడవలు అత్తకోడళ్ల పోట్లాట లాంటివని చెప్పారు. ఈ సారి గెలుపు హస్తానిదే అంటున్న జగ్గారెడ్డితో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.