Leading News Portal in Telugu

Shivraj Singh Chouhan: కమల్‌నాథ్ నమ్మలేం.. ఆయన ఈ రాష్ట్రానికి చెందినవాడు కాదు..



Madhya Pradesh

Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కేవలం మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 17న రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దశాబ్ధానికి పైగా పాలిస్తున్న బీజేపీని అధికారంలోకి దించేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది.

Read Also: Diwali: ఆ రాష్ట్రంలోని 7 గ్రామాల్లో 22 ఏళ్లుగా నిశ్శబ్ధ దీపావళి.. కారణం ఇదే..

అయితే తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎం అభ్యర్థి రేసులో ముందున్న కమల్ నాథ్ పై విరుచుకుపడ్డారు. కమల్ నాథ్ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని, ఆయనను నమ్మలేమని శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్ జిల్లాలోని బెరాసియా అసెంబ్లీ స్థానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కమల్ నాథ్ మధ్యప్రదేశ్‌కి చెందిన వారు కాదు.. మనం ఇక్కడే పుట్టాం, ఆయన ఎక్కడ పుట్టారో చెప్పండి..? అంటూ ప్రశ్నించారు. ప్రజలతో ఆయనకు సంబంధం లేదని అన్నారు.

కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు డబ్బుల కొరత ఏర్పడిందని చౌహాన్ ఆరోపించారు. అభివృద్ధి పనులకు తన వద్ద డబ్బుల కొరత లేదని.. అన్ని పనులు చేపడుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.