Leading News Portal in Telugu

Oppo A2 Mobiles : ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్?



Oppo A2

ప్రముఖ మొబైల్ బ్రాండ్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకోనేలా అదిరిపోయే ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. తాజాగా మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది.. కొత్త ఒప్పో ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 6020 ఎస్ఓసీతో 12జీబీ ర్యామ్ 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుంది. అలాగే ఒప్పో ఏ2 ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది.

బ్యాక్ సైడ్ 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ తో సపోర్టు ఇస్తుంది.. ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో గరిష్టంగా 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 91.4 స్క్రీన్ రేషియో, డిస్‌ప్లే 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్ వరకు అందిస్తుంది. 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, మాలి-జీ57 ఎమ్‌సీ2 తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC ద్వారా రన్ అవుతుంది. కెమెరాను చూస్తే.. 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఒప్పో ఏ2లోని కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై, బ్లూటూత్, యూఎస్‌బీ 2.0, 3.5ఎమ్.ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఏ-జీపీఎస్ ఉన్నాయి…

ధరను చూస్తే.. ఏ2 బేస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 (దాదాపు రూ. 16,500)కు అందిస్తోంది. అంతేకాదు 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్‌తో టాప్-ఎండ్ మోడల్ ధర సీఎన్‌వై 1,799 (దాదాపు రూ. 20వేలు) ఉంటుంది. ప్రస్తుతం చైనాలో ఐస్ క్రిస్టల్ వైలెట్, జింఘై బ్లాక్, క్వింగ్బో ఎమరాల్డ్ కలర్ ఆప్షన్లలో ఒప్పో స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.. భారత్ లోకి ఇంకా పూర్తిగా రాలేదు..