
పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లోలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా భారతీయ సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరగక ముందు ఆదివారం రాత్రి కుటుంబమంతా కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుందని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
Read Also: Criminal Escape: పోలీసుల కళ్లు గప్పి పరారైన కరడుగట్టిన నేరస్తుడు..
ఈ ఘటనపై లండన్ పోలీసులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి హౌన్స్‌లో పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ సంతాపం తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం 10.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. లండన్ ఫైర్ బ్రిగేడ్, లండన్ అంబులెన్స్ సర్వీస్‌తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Criminal Escape: పోలీసుల కళ్లు గప్పి పరారైన కరడుగట్టిన నేరస్తుడు..
ఈ అగ్నిప్రమాదంలో మరణించిన ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. గాయపడిన మరో వ్యక్తి వివరాలు తెలియరాలేదు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఎలాగోలా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆసుపత్రిలో చేరాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం.. ముందుజాగ్రత్తగా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మాంచెస్టర్‌కు చెందిన 54 ఏళ్ల దిలీప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో తన బావ, భార్య, ముగ్గురు పిల్లలు, ఇద్దరు అతిథులు ఉన్నారని చెప్పారు.