Leading News Portal in Telugu

Jk Bus Accident: జమ్యూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 30 మంది మృతి



Doda Bus Accident

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన దోడా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యు టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. బుధవారం ఉదయం బస్సు 40 మంది ప్రయాణికులతో కిష్త్వార్ నుంచి జమ్మూ వైపు వెళ్తోంది.

Also Read: Nana Patekar: షూటింగ్ స్పాట్‌లో యువకుడిపై చేయి చేసుకున్న నటుడు.. వీడియో వైరల్

ఈ క్రమంలో ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ట్రుంగల్-అస్సార్ సమీపంలో అదుపుతప్పి 300 లోతు ఉన్న లోయలో పడిపోయింది.
ప్రమాదం గురించి తెలిసి అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి సహాయ బృందాలకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న రెస్య్కూ టీం సహాయ చర్యలు చేపట్టి గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Also Read: Nana Patekar: షూటింగ్ స్పాట్‌లో యువకుడిపై చేయి చేసుకున్న నటుడు.. వీడియో వైరల్

అనంతరం బస్సులో చిక్కుకున్న మృతదేహాలకు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంపై తాజాగా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. ‘దోడాలోని అస్సార్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని డివ్ కామ్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మిన్‌ను ఆదేశించాం’ అని ఆయన తెలిపారు.