
Tammineni Sitaram: జగన్ జైత్ర యాత్రను ఆపే శక్తి ఎవరికి లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవాడు ఆకలితో చస్తుంటే… రోడ్లు వేసి అభివృద్ది అంటే ఎలా అని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి అని పేర్కొన్నారు. జీడీపీ డబుల్ డిజిట్స్కి వెళ్లిందన్నారు. క్వాలిటేటివ్ లైఫ్ పెరిగిందని.. పేదవాడు ఆకలి పోయి.. ఆనందంగా తిరిగితే అది అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. విద్యను ప్రోత్సహిస్తుంటే అది అభివృద్ధి కాదా అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో సీట్ల కోసం రికమేండేషన్ చేయమని వస్తున్నారన్నారు.
కులం, మతం, రంగు లేదు… అర్హతే ప్రామాణికంగా పథకాలు అందజేస్తున్నామన్నారు. డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నారని.. ప్రజల నుంచి వచ్చిన డబ్బు ప్రజలకే ఇస్తున్నారన్నారు. రైతుకు ఇప్పటి వరకు ఆఫీస్ లేదు.. జగన్ రైతుల కోసం రైతుభరోసా కేంద్రం కట్టి.. ఇది మీ కార్యాలయం అని చూపించారన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఏం చేశాడని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వడం మానేసి.. స్కిల్ స్కాం చేశాడని మండిపడ్డారు. వందల ఎకరాలు కబ్జా చేసి.. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారన్నారు. ఆంధ్రాను ఆలీ బాబా నలబై దొంగల్లా రాష్ట్రం మొత్తాన్ని టీడీపీ నేతలు, చంద్రబాబు లూటీ చేశారని విమర్శించారు. సామాజిక దామాషా పద్దతిలో చంద్రబాబు పదవులే ఇవ్వలేదన్నారు. జగన్ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.