Leading News Portal in Telugu

Fire Accident: న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..రైలు నుంచి దూకిన ప్రయాణికులు..



Fire Accident

Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు.

Read Also: Jagga Reddy Exclusive Interview LIVE : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో క్వశ్చన్ అవర్

స్టేషన్ మాస్టర్ పొగలు వస్తున్న విషయాన్ని రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించి రైలుని నిలిపేశారు. అనంతరం స్లీపర్ కోచ్ నుంచి ప్రయాణికులను దించేశారు. మంటలు అంటుకున్న వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. సమచారం ప్రకారం.. రైలులో దాని సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.