Leading News Portal in Telugu

Haromhara: నేల టికెట్ భామ సడెన్ గా దేవిగా ప్రత్యక్షమయ్యిందేంటి ..?



Malavika

Haromhara: నెట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా సెహరి ఫేం జ్ఞానసాగర్‌ ద్వారకా డైరెక్ట్‌ చేస్తున్న చిత్రం హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి.. చేతన్ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. హరోం హర సుధీర్‌ బాబు కెరీర్‌లోనే హై బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు కథానుగుణంగా కుప్పం యాసలో మాట్లాడబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ను మేకర్స్ పరిచయం చేశారు. నేల టికెట్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ మాళవిక శర్మ.

Atharva: మర్డర్ మిస్టరీ చుట్టూ ‘అథర్వ’

ఇక ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమానే రవితేజతో నటించే ఛాన్స్ పట్టేయడంతో అమ్మడి పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది. కానీ, విజయం అందుకోలేకపోవడంతో ప్రేక్షకులు అంతగా గుర్తించలేకపోయారు. సినిమాలో గుర్తించకపోతే ఏం.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ.. అభిమానులుకు బాగా దగ్గరగా మారింది. ఇక ఈ భామ.. హరోం హర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి అనే పాత్రలో మాళవిక నటిస్తుందని మేకర్స్ తెలుపుతూ.. తన పోస్టర్ ను రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టే పోస్టర్ లో ఎంతో అందంగా… పద్దతిగా కనిపించింది. ఈ లెక్కన ఈ సినిమా కేవలం సుధీర్ బాబుకే ముఖ్యం కాదు.. అమ్మడికి కూడా ముఖ్యమే. ఇద్దరికీ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.