Leading News Portal in Telugu

Merry Christmas: సంక్రాంతి రేసులో ‘మెర్రీ క్రిస్మస్‌’.. మహేష్ సినిమాతో పోటి?



Merry

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి మాములుగా లేదు.. తెలుగు, తమిళ మూవీస్ పోటి పడబోతున్నాయి.. ఈ రేసులో ఇప్పుడు మరో కొలీవుడ్ సినిమా చేరింది.. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది.. ఈ సినిమాను హిందీ డైరెక్టర్ శ్రీ రామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి తెరకేక్కిస్తున్నారు..

ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా తీసుకు వస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ ని పోస్టుపోన్ చేస్తూ సంక్రాంతికి తీసుకు వెళ్లారు. జనవరి 12న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.. అయితే ఆ తేదీన మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదల కాబోతుంది.. అలాగే తేజా నటించిన హనుమాన్ కూడా విడుదల కాబోతుంది..

ఇదిలా ఉండగా ఈ రెండు తెలుగు చిత్రాల మధ్య ఈ డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుందా..? తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయా..? అనే సందేహాలు కూడా సినీ అభిమానుల్లో వస్తున్నాయి.. వెంకటేష్ ‘సైంధవ్‌’, రవితేజ ‘ఈగల్’ చిత్రాలు జనవరి 13న రిలీజ్ అవుతున్నాయి. ఇక నాగార్జున ‘నా సామిరంగ’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా కచ్చితమైన డేట్ అనౌన్స్ చేయనప్పటికీ సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించారు. మరి ఇంత కాంపిటీషన్ మధ్య ‘మెర్రీ క్రిస్మస్‌’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తారా..? లేక ఆ రెండు భాషల్లో రిలీజ్ చేసి చేస్తారా అనేది ఇంకా క్లారిటీ గా తెలియదు.. హిందీ వెర్షన్‌లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్ను ఆనంద్ కనిపించనున్నారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో నటిస్తున్నారు..