
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రోజు ఓ వ్యాపారి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలు అతని భార్యను కట్టేసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడటమే కాకుండా సిగరెట్లతో దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Read Also: Local Protest: మంత్రులకు నిరసన సెగ.. దళిత యువకుడి మృతిపై విచారణకు డిమాండ్
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బిజ్నోర్‌లో ఘటన చోటు చేసుకుంది. హార్డ్‌వేర్-పేయింట్ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తన తల్లి, పిల్లలతో కలిసి మెడిసిన్స్ కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అల్మారాలను పగలగొట్టి బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, రూ. 1.5 లక్షల విలువైన నగదును దోచుకున్నారు. మహిళను ఓ గదిలో బంధించి ఇంట్లోని స్కూటర్‌ని తీసుకుని పరారయ్యారు.
Read Also: Husband Kills Wife: భార్యను టూర్‌కి తీసుకెళ్లి స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు..
రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇంటి పైకప్పు నుంచి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యను కొట్టడవంతో పాటు ఆమెను బంధించి, స్పృహ తప్పేలా చేశారని, సామూహిక అత్యాచారం చేసి, సిగరెట్లతో కాల్చారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మహిళను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మూడు టీంలతో నిందితులను పట్టుకునేందుకు వెతుకుతున్నట్లు ఎస్పీ రామ్ అర్జ్ తెలిపారు.