Leading News Portal in Telugu

Wedding Season: పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపారవేత్తల కళ్లు.. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా..!



Business

దీపావళి పండుగతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ రాబోయే ఇతర పండుగలతో సహా భారతదేశంలో మొత్తం రూ. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని చిరు వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) అంచనా వేసింది.

Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!

ఇదిలా ఉంటే.. నవరాత్రి నుండి దీపావళి వరకు దేశంలోని ప్రధాన రిటైల్ వ్యాపారంలో రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇందులో దుర్గాపూజ, ఇతర పండుగల సమయంలోనే దాదాపు రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగింది. గతంలో గణేష్ చతుర్థి 10 రోజుల వేడుకల్లో రూ.20-25 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం.. ఈ గణాంకాలు ప్రధానంగా 3 పెద్ద పండుగలకు మాత్రమే ఉన్నాయి. రక్షాబంధన్, జన్మాష్టమి, మహాశివరాత్రి, హోలీ సందర్భంగా జరిగిన వ్యాపారాన్ని కూడా కలుపుకుంటే ఈ లెక్కన కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.

Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్

దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ ఆలయాలను సందర్శించే భక్తులు ప్రతిరోజూ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సంఖ్య లక్షల కోట్లు అవుతుంది. దీనికి పండుగల ఆచారాలు, పెళ్లిళ్లకు చేసే ఖర్చు, తీర్థయాత్రల ఖర్చులు కలిపితే, ప్రపంచంలోని 100కి పైగా దేశాల మొత్తం జీడీపీ కంటే రూపాయి చలామణి ఎక్కువ అవుతుంది. ఇది కొత్త విధానం కాదనీ.. వేల ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. మరోవైపు.. ఒక్క ధన్‌తేరస్‌ డే డేటా ఆధారంగానే ఈ ఒక్కరోజే రూ.25,500 కోట్ల విలువైన 41 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు క్యాట్‌ వెల్లడించింది. అటు వెండి అమ్మకాలు రూ.3000 కోట్లకు చేరుకున్నాయి. కార్ల తయారీదారులు 55,000 కార్లను డెలివరీ చేయగా, 5 లక్షలకు పైగా స్కూటర్లు, మోటార్ సైకిళ్లను డెలివరీ చేశారు.