
దేశంలోని 4 పెద్ద మెట్రో నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది. ఇదిలా ఉంటే.. దీపావళికి ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.50కి పైగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.57.50కి తగ్గడంతో.. 19 కిలోల బ్లూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1775.50కి చేరింది. అటు.. కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల్లో కూడా.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. కోల్‌కతాలో రూ.1885.50, ముంబైలో రూ.1728, చెన్నైలో రూ.1942గా ఉన్నాయి.
Read Also: World Cup 2023 Final: 40 ఏళ్లలో నాలుగోసారి ఫైనల్.. గత మూడు గొప్ప మ్యాచ్‌ల్లో ఏం జరిగిందంటే?
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం 15 రోజుల క్రితమే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.101.50 పెంచింది. అంతకు ముందు అక్టోబర్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1731.50, కోల్‌కతాలో రూ.1839.50, ముంబైలో రూ.1684, చెన్నైలో రూ.1898గా ఉంది. ఇక.. ఆగస్టు నెల నుంచి రెడ్ కలర్ డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పుడు దానిపై ప్రభుత్వం రూ.200 సబ్సిడీ ఇస్తోంది. దీంతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉంది. దేశీయ LPG సిలిండర్ల ధరలలో మార్చిలో మార్పు జరిగింది.
Read Also: Shreyas Iyer: రోహిత్ శర్మకి భయం అంటే తెలియదు.. అతని బాడీ లాంగ్వేజ్ ఒక రకమైన అంటువ్యాధి..
మరోవైపు.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.200 రాయితీ ఇస్తోంది. ఆ తర్వాత మొదట రూ.200కి పెంచి, ఆ తర్వాత మొత్తం రూ.300కి పెంచారు. దీంతో ఉజ్వల పథకం లబ్ధిదారుల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.603కి పెరిగింది.