Leading News Portal in Telugu

Lizard in Samosa: సమోసాలో బల్లి.. తండ్రీకూతుళ్లకు అస్వస్థత..



Lizard In Samosa

Lizard in Samosa: ఇటీవల కాలంలో బయటి ఆహారంతో జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పుడ్ ఫాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో చికెన్ షవర్మా వల్ల ఒకరిద్దరి ప్రాణాలు పోయాయి. రెస్టారెంట్ల, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారుల నిఘా లేకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. ఆహారంలో బల్లులు, కీలకాలు, ఎలుకలు రావడం పరిపాటిగా మారింది. సామాన్య జనాల ప్రాణాలతో ఫుడ్ మాఫియా ఆటలాడుకుంటోంది.

Read Also: Pakistan: పాకిస్తాన్ కార్ మార్కెట్ ఢమాల్.. దాయాదితో పోలిస్తే భారత్‌లో 100 రెట్లు ఎక్కువ అమ్మకాలు..

ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ హాపూర్‌లో సమోసా తిన్న తండ్రీకూతుళ్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి స్థానిక మిఠాయి దుకాణం నుంచి సమోసాలు కొనుగోలు చేసేందుకు తన కుమారుడిని పంపారు. అతని కొడుకు తీసుకువచ్చిన సమోసాలను తింటున్న సమయంలో వాటిలో చనిపోయిన బల్లి కనిపించింది. మనోజ్ కుమార్ కూతురు బల్లిని ఉన్న సమోసాను నమిలింది. కూతురు బల్లిని గమనించడానికి ముందే మనోజ్ కుమార్ ఓ సమోసాను అప్పటికే తిన్నాడు. కొద్దిసేపటికే తండ్రీ కూతుళ్లు అస్వస్థతకు గురయ్యారు. తినుబండారాల షాపుకు వెళ్లి గొడవకు దిగారు. ఈ గొడవతో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు షాపు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ ఆరోపించారు.