Leading News Portal in Telugu

Chelluboina Venugopalakrishna: చంద్రబాబు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడు..



Chelluboina Venu

Chelluboina Venugopalakrishna: చంద్రబాబు మోసగాడు, నిజం మాట్లాడని వ్యక్తి రైతును మోసం చేశాడు 87 వేల కోట్ల రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సామాజిక సాధికార సభలో మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రసంగించారు.

Also Read: Chandrababu Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వ్

చంద్రబాబు ఒక అబద్ధమని.. సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు వైఖరితో తీవ్ర మనోవేదనకు గురైన ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలను సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. జగన్ అంటే నిజం.. చంద్రబాబు అంటే అబద్ధం అని జనాలకు తెలుసన్నారు. పేదరికమనే రక్కసిని ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీల దరికి చేరకుండా కాపాడిన వ్యక్తి సీఎం జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. రేపటి వైఎస్ఆర్సీపీ గెలుపు ఒక ఎస్సీ గెలుపు, బీసీ గెలుపు, ఎస్టీ గెలుపు, మైనారిటీ గెలుపు కూడా అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.