
Fraud: ‘కాదేదీ కవితకు అనర్హం’ అని చెప్పారు మహాకవి శ్రీశ్రీ.. కానీ, నేడు కాదేదీ అవినీతికి అనర్హం అంటున్నారు కేటుగాళ్లు.. మోసం చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశం వదలడంలేదుగా.. అనే విధంగా.. ఇప్పుడు విశాఖ రాజధానిని కూడా వాడేస్తున్నారు.. విశాఖ ఏపీకి పరిపాలన రాజధానిగా మారబోతోన్న విషయం విదితమే.. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. దాని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, రాజధాని పేరుతో ఓ వ్యక్తికి రూ.7.80 లక్షలు టోకరా వేశారు కేటుగాళ్లు.. నిందితులు విశాఖ పరిసర ప్రాంత వాసులుగా గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ రాజధాని అవుతుందని లక్షల్లో పెట్టుబడి పెడితే.. కోట్ల రూపాయలు లాభం వస్తుందని ఆశ చూపించి ఓ వ్యక్తిని నిండా ముంచారు.. దీనిపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. బాధితుడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నివాసి, అతడి తండ్రి పోతురాజు పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు.. రిటైర్డ్ అయ్యాక ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షలు అందాయి.. అయితే, రాజధాని ప్రాంతంలో మంచి స్థలం ఇప్పిస్తామని నకిలీ డాక్యుమెంట్లు చూపించి మోసం చేశారు కేటుగాళ్లు.. ఇప్పుడు లక్షలు పెడితే చాలు.. త్వరలోనే అది కోట్లు పలుకుతుందని.. నమ్మబలికారు.. వారి మాటల్లో పడిపోయిన బాధితులు.. రూ.7.80 లక్షలు ఇచ్చారు.. అయితే, తమకు ఇచ్చినవి నకిలీ డాక్యుమెంట్లు అని గుర్తించిన బాధితులు.. లబోధిమోమంటూ పోలీసులను ఆశ్రయించారు.. ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.