Leading News Portal in Telugu

Malreddy Rangareddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం..


Malreddy Rangareddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం..

Malreddy Rangareddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్ పెళ్లి, చింతపల్లిగూడ, ఆదిభట్ల, బొంగులూరు, మంగళపల్లి, కొంగర కలాన్‌ గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిస్తేనే ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో డబుల్ బెడ్‌రూం, రేషన్ కార్డు లేని ప్రజలు చాలామంది ఉన్నారని.. వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎస్సీలకు ఆరు లక్షలు, బీసీలకు ఐదు లక్షల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామని ఆయన హామీలు గుప్పించారు. అదేవిధంగా పేద ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టిందని.. ఈసారి తనను, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రజలను కోరారు.

ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా స్వచ్చందంగా ప్రజలు కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అవినీతిపరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడని… ప్రజల భూములు లాక్కున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో తాను ఉన్నప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్‌ను ఓటమి పాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.