Leading News Portal in Telugu

Andhrapradesh: ‘జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’ పుస్తకం ఆవిష్కరణ


Andhrapradesh: ‘జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’ పుస్తకం ఆవిష్కరణ

Andhrapradesh: అమరావతిలోని సెక్రటేరియట్‌లో ‘జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు తమ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలుపుతూ పుస్తక రచన జరిగింది. సీఎం జగన్ చేసిన కృషి, ప్రజల అభిప్రాయాలు, వివిధ వర్గాల సమాచారం జోడించి రచన జరిగినట్లు పుస్తక రచయిత వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.

సీఎం జగన్ చాతుర్యాన్ని, పరిపాలన తీరుని, 49 ఛాప్టర్లుగా పుస్తక రచన చేసిన వేణుగోపాల్ రెడ్డికి మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందనలు తెలిపారు. 75 సంవత్సరాల స్వతంత్రం అనంతరం కొత్త పరిపాలన విధానాలు అమలుచేస్తున్న సీఎం గురించిన పుస్తకం రచించారని.. ఈ పుస్తకం భావితరాలకు ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ అధినేత గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం ఉందన్నారు.