Leading News Portal in Telugu

Redmi Note 13R Pro: రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. సెల్ఫీ ప్రియులకు పండగే..


Redmi Note 13R Pro: రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. సెల్ఫీ ప్రియులకు పండగే..

ఈ మధ్య యువత ఎక్కువగా కెమెరా పిక్సెల్ ఎక్కువగా ఉన్న ఫోన్లను వాడుతున్నారు.. మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఫోన్లను ముందుగా కెమెరాను చూసే కొంటున్నారు.. ఇక స్మార్ట్ ఫోన్‌ కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఎక్కువ మెగాపిక్సెల్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్‌ను తక్కువ ధరలోనే తీసుకొస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ చైనా చెందిన రెడ్ మీ బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలోనే తీసుకొస్తుండడం విశేషం.

ఇదిలా ఉండగా రెడ్‌మీ ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఫీచర్స్ ఫోన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. 6.67 ఇంచెస్‌తో కూడి డిస్‌ప్లేను అందించనున్నారు. హోల్ పంచ్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించనున్నారు.. ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, టైమ్ బ్లూ, మార్నింగ్ లైట్ గోల్డ్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 128 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారు.రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రో స్మార్ట్ ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను సైడ్‌కు అందించనున్నారు…

ఇక కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు పండగే.. 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. దీంతో మంచి క్వాలిటీతో కూడిన ఫొటోలను తీసుకోవచ్చు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు… ఇక ధర విషయానికోస్తే.. చైనా లో 1999 యువాన్లుగా ఉంది.. మన కరెన్సీ లో రూ. 23,000 ఉండవచ్చునని అంచనా.. త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారని సమాచారం..