
హార్రర్ మూవీస్ అంటే కొంతమందికి చాలా ఇష్టం.. మరికొంతమంది భయపడతారు.. అయినా చూడటానికి థ్రిల్ గా సస్పెన్స్ లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సినిమాలను చూస్తారు.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి.. తాజాగా ఓ అధ్యయనంలో నమ్మేలేని నిజాలను పేర్కొన్నారు.. హార్రర్ సినిమాలు చూడటం థ్రిల్ ను ఎంజాయ్ చెయ్యడం మాత్రమే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోదకులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం పదండీ..
90 నిమిషాల డ్యురేషన్ కలిగిన హారర్ ఫిల్మ్ సుమారు 150 కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని గుర్తించారు వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు.. వీరు పరిశోధనలో భాగంగా కొంతమందికి డిఫరెంట్ హారర్ మూవీస్ చూపించారు. ఈ క్రమంలో వారి హార్ట్ రేటు, ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదిలేయడాన్ని ఓ డివైజ్ సహాయంతో కొలిచారు. భయానక చలనచిత్రాలను చూస్తున్నప్పుడు హృదయ స్పందన రేటు, జీవక్రియ పెరిగింది. ఇది అధిక కేలరీలను కరిగిస్తుందని తెల్చేశారు..
జనాలు సినిమాను చూసే విధానం ను బట్టి క్యాలరీలు బర్న్ అవుతాయని చెబుతున్నారు.. మొదటి పది భయానక చిత్రాలను (ది షైనింగ్ (184 కేలరీలు), జాస్ (161 కేలరీలు) మరియు ది ఎక్సార్సిస్ట్ (158 కేలరీలు)) గుర్తించిన అధ్యయనం.. ఈ మూవీస్ జంప్-స్కేర్ మూమెంట్స్ అని.. వీక్షకుల హృదయ స్పందన రేటు, ఆడ్రినలిన్ స్థాయిలను పెంచుతాయని తెలిపింది.. భయం కారణంగా ఆడ్రినలిన్ వేగంగా విడుదల కావడం ఆకలిని అణిచివేస్తుంది. బేసల్ మెటబాలిక్ రేటును పెంచుతుంది.. అలా బరువు తగ్గుతారు.. ఇది అసలు విషయం..