
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాల గురించి మాట్లాడితే ఎలా ఉన్నాయంటే…. ఆస్ట్రేలియా డేరింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 350,000 డాలర్లు ఉంది. ఈ ఆటగాళ్లు క్రికెట్ ఆస్ట్రేలియా నుండి ప్రతి సంవత్సరం 350,000 డాలర్లు( ఇండియన్ కరెన్సీలో కోటికి పైగా) పొందుతారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 750,000 డాలర్లు తీసుకోనున్నాడు. వీరే కాకుండా.. ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్ వంటి ఆటగాళ్లు సంవత్సరానికి 278,000 డాలర్లు పొందుతారు.
Cyclone Midhili: రాత్రి తీరం దాటనున్న ‘మిధిలీ తుఫాన్’.. బెంగాల్, ఒడిశాలో హైఅలర్ట్..
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక టీ20 మ్యాచ్ ఆడినందుకు 10 వేల డాలర్లు పొందుతారు. అలాగే.. ఒక వన్డే మ్యాచ్‌కు 15 వేల డాలర్లు ఫీజుగా ఇస్తారు. ఇవే కాకుండా.. బిగ్ బాష్, ఇతర టీ20 లీగ్‌ల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. కాగా.. టీమిండియా ఆటగాళ్ల గురించి చెప్పాలంటే.. గ్రేడ్-ఎ ప్లస్ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రతి సంవత్సరం రూ.7 కోట్లు ఇస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గ్రేడ్-ఎ+ ప్లస్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. గ్రేడ్-ఎ ఆటగాళ్లకు ప్రతి ఏడాది రూ.5 కోట్లు బీసీసీఐ అందిస్తుంది.
Lifestyle : హార్రర్ మూవీస్ చూస్తే నిజంగా బరువు తగ్గుతారా?
గ్రేడ్-బి ఆటగాళ్లకు ప్రతి సంవత్సరం రూ.3 కోట్లు బీసీసీఐ ఇస్తుంది. అంతేకాకుండా.. గ్రేడ్-సి ఆటగాళ్లు ఏటా కోటి రూపాయలు పొందుతారు. అంతేకాకుండా.. భారత ఆటగాళ్లు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రుసుముగా రూ.15 లక్షలు ఇస్తారు. ఒక్క వన్డే మ్యాచ్‌కు టీమిండియా ఆటగాళ్లకు రూ.6 లక్షలు ఇస్తుంది. అలాగే భారత క్రికెటర్ల టీ20 ఫీజు ఒక్కో మ్యాచ్‌కు రూ.3 లక్షలు బీసీసీఐ ఇస్తుంది.