
Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న జగ్గూభాయ్.. ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ క్యారెక్టర్స్ తో బిజీగా మారాడు. ఇక జగపతి బాబు లేకుండా స్టార్ హీరో సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. నిత్యం తన ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అద్భుతమైన క్యాప్షన్స్ ఇస్తూ ఉంటాడు. జగ్గూభాయ్ ఫోటోలు ఏమో కానీ.. ఆ క్యాప్షన్స్ అయితే వేరే లెవెల్. వాటికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తాజాగా జగపతి బాబు.. మరో ఫోటోను షేర్ చేసాడు. బ్లాక్ డ్రెస్ పై బ్లాక్ జర్కిన్ వేసి.. బ్లాక్ క్యాప్ పెట్టి.. నోట్లో సిగరెట్ పెట్టుకొని కనిపించాడు.
Varalaxmi Sarath Kumar: ఇప్పటివరకూ ఏ సినిమాలో ఇలాంటి సీన్ చేయలేదు!
ఇక ఈ లుక్ కు.. ” హాలీవుడ్ పిలుస్తుంది.. ఏమంటారు” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నావ్ అన్నా.. వెళ్లిపో హాలీవుడ్ కు అని కొందరు.. హాలీవుడ్ కు వెళ్తాము.. ఆస్కార్ కొడతాం అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం జగ్గూభాయ్ సినిమాల విషయానికొస్తే.. సలార్ తో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో జగ్గూభాయ్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.