Leading News Portal in Telugu

Alia Bhatt: రణ్‌బీర్‌ ఆలియాను వేధిస్తున్నాడా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌



Alia Bhatt

Alia Bhatt Reacts on Rumours: బాలీవుడ్‌ కపుల్‌ ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ల వైవాహకి జీవితంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌ మంచి వాడు కాదని, ఆలియాను వేధిస్తున్నాడంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అలియా కూతురు రహాతో అదే అపార్టుమెంటులో మరో ప్లాట్‌లో నివసిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా తరచూ అలియా-రణ్‌బీర్‌ పర్సనల్‌ లైఫ్‌పై రోజుకో వార్త ప్రచారంలో ఉంటోంది. అయితే ఇప్పటి వరకు రణ్‌బీర్‌ కానీ, ఆలియా కానీ వాటిపై స్పందించలేదు. తాజాగా కరీనా కపూర్‌తో కలిసి కాఫీ విత్‌ కరణ్‌ టాక్‌ షోలో పాల్గొన్న ఆలియా ఈ పుకార్లపై స్పందించింది. తమ మ్యారేజ్‌ లైఫ్‌ గురించి, బయట వినిపిస్తున్న వార్తలపై కరణ్‌ ఆలియాను ప్రశ్నించాడు. దీనిపై ఈ బ్యూటీ కాస్తా ఘాటుగానే స్పందించింది.

Also Read: Prabhas : ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ప్రభాస్..?

‘ప్రస్తుతం సోషల్‌ మీడియా, ఇంటర్‌నెట్‌ కాలం. అందుకే చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతివాడు జర్నలిస్ట్‌ అయిపోతున్నాడు. తరచూ సెలబ్రిటీలపై ఏదోక రూమర్‌ సృష్టిస్తూనే ఉన్నారు. నేను సన్నగా, తెల్లగా మారేందుకు సర్జరీ చేసుకున్నానంటు వార్తలు రాస్తున్నారు. ఓ ఇంటర్య్వూలో రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్‌ నచ్చదని, నేను వేసుకుంటే ఊరుకోడు అని చెప్పాను. దానిలో మరో అర్థం తీస్తూ.. రణ్‌బీర్‌ నన్ను వేధిస్తున్నాడంటూ వార్తలు సృష్టించారు. రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా మా పర్సనల్‌ లైఫ్‌పై రూమర్స్‌ పుట్టిస్తున్నారు. రణ్‌బీర్‌ విడాకులు సిద్ధమయ్యాడంటూ కూడా రాస్తున్నారు. ఇవన్ని చూసి చాలా భాదేసింది’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై ఎలాంటి రూమర్స్‌ వచ్చినా తనని బాధించవని, కానీ రణ్‌బీర్‌పై ఇలాంటి వార్తలు రాయడం బాధ కలిగించిందని పేర్కొంది. రణ్‌బీర్‌ చాలా మంచివాడని, తనని చాలా బాగా చూసుకుంటాడంటూ తమ విడాకుల వార్తలకు చెక్‌ పెట్టింది.