Leading News Portal in Telugu

Uttam Kumar Reddy: నేను ఆ మాటలు చెప్పలే.. ఫిర్యాదు చేయలే..



Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెబుతున్నట్లుగా రైతుబంధు ఆపాలని తాను ఎక్కడా ఫిర్యాదు చేయలేదన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నామినేషన్ ప్రక్రియకు ముందే రైతు బంధు, ఇతర పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు నిధిని పెంచాలన్నారు. రైతుబంధును ఆపాలని తానుగానీ, కాంగ్రెస్‌ నేతలుగానీ కోరలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు 70 ఏళ్లుగా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నా చెక్కు చెదరలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని ఆరోపించారు.

Read also: CM Stalin: అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ కీలక తీర్మానం.. గవర్నర్‌పై సంచలన ఆరోపణలు

నీళ్లు రాకముందే ప్రాజెక్టులు కూలిపోతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి రిస్క్ తీసుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఈసారి కేసీఆర్ ను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని అన్నారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ కుటుంబం ఓట్లు అడగాలని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ప్రారంభించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వబోతున్నామన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రైతులకు ద్రోహం చేశారన్నారు.
CM Stalin: అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ కీలక తీర్మానం.. గవర్నర్‌పై సంచలన ఆరోపణలు