Leading News Portal in Telugu

Eoin Morgan: ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం ఆ జట్టుకు ఉంది.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు



Morgon

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ లో భారత్ నిర్దేశించిన పరుగులను ఛేదించే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉందని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా జట్టు ఆరో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోందని పేర్కొన్నాడు. మెన్ ఇన్ ఎల్లో వారి గేమ్‌ను ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలుసు అని చెప్పాడు.

Read Also: Rohit Sharma: ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఫోన్ రింగ్.. రోహిత్ శర్మ ఫైర్..!

భారత అజేయ విజయాన్ని అడ్డుకోగల ఏకైక జట్టుగా.. ఆస్ట్రేలియా రాణించగలదని ఇయాన్ మెర్గాన్ అన్నాడు. మూడు ఫార్మాట్లలో వారు ఆడిన ఆటతీరు విశ్వాసాన్ని పెంచుతుందని మోర్గాన్ తెలిపాడు. ఈ టోర్నీలో మొదటి రెండు మ్యాచ్ లో ఓడినప్పటికీ, ఆ తర్వాత పాట్ కమ్మిన్స్ అండ్ కో. వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచారని తెలిపాడు. ఇక రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు అద్భుతంగా ఆడుతుందని ఇయాన్ మోర్గాన్ చెప్పాడు.

Read Also: Heavy Rains: దుబాయ్లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

ఇక.. ప్రపంచకప్ ఫైనల్ పోరు కోసం ఇండియా అభిమానులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఎంతగానో కోరుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా.. మరోసారి ఫైనల్ ట్రోపీని ముద్దాడాలని చూస్తుంది. చూడాలి మరీ రేపటి ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారో…..