Leading News Portal in Telugu

Domestic Violence: అత్తగారి ఇంట్లో ఉన్నది 11 రోజులే.. వరకట్న వేధింపుల కేసు..కోర్టు ఏం చెప్పిందంటే..



Dowry Harassment

Dowry Harassment: ఒక మహిళ తన భర్త, అత్తామామలపై వేధింపులు, క్రూరత్వం, దొంగతనం ఆరోపణలతో కేసు పెట్టింది. అయితే సదరు మహిళ కేవలం అత్తగారి ఇంట్లో 11 రోజులు మాత్రమే ఉంది. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు, మెజిస్ట్రియల్ కోర్టు ఆదేశాలను సమర్థించింది. ఈ కేసు చట్టవిరుద్ధంగా లేదని చెప్పింది.

క్రూరత్వానికి సంబంధిచిన కేసులో తన అత్తామామలపై ఫిర్యాదు చేసి ముందు కోడలు అత్తాగారి ఇంట్లో ఎంత సమయం ఉండాలనే విషయాన్ని చట్టం చెప్పలేదని కోర్టు పేర్కొంది. ఆమె 11 రోజులు కాదు, కొన్ని గంటలు ఉన్నప్పటికీ వేధింపులకు గురికావచ్చని పేర్కొంది.

Read Also: World Cup 2023 Final: వరల్డ్ కప్‌ ఫైనల్‌.. బెట్టింగ్‌రాయుళ్లపై ప్రత్యేక నిఘా

భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 498A (భర్త లేదా భర్త బంధువు ఆమెను క్రూరత్వానికి గురి చేయడం) కింద తమపై అభియోగాలు మోపుతూ మెజిస్ట్రియల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మహిళ భర్త మరియు అత్తమామలు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను అదనపు సెషన్స్ జడ్జి సునీల్ గుప్తా విచారించారు. ఛార్జిషీట్ ప్రకారం.. భార్యను భర్తతో పాటు అత్తామామలు కట్నం డిమాండ్ చేస్తూ కొట్టేవారని, ఆ ముగ్గురితో పాటు మరిది కూడా ఆమె నగలు బలవంతంగా లాక్కుని అతని వద్దే ఉంచుకున్నారని ఫిర్యాదు చేసింది.

నిందితుడిపై రికార్డులో ఉన్న మెటీరియల్స్ ఆధారంగా నిందితుడిపై ప్రాథమికంగా కేసు నమోదు చేయబడిందా..? లేదా..? అనేదాన్ని కోర్టు చూడాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిందితుల తరుపున వాదించిన లాయర్, మహిళ కేవలం 11 రోజులు మాత్రమే అత్తగారింట్లో ఉందని, ఎలాంటి వేధింపులు జరగలేదని కోర్టుకు తెలిపారు. అయితే అతని వాదల్ని తప్పుపట్టిన కోర్టు.. ఐపీసీ 498ఏ నేరం కింద ఫిర్యాదు చేయడానికి, వివాహిత అత్తగారింట్లో ఉండేందుకు కనీస వ్యవధిని చట్టంలో పేర్కొనలేదని కోర్టు పేర్కొంది. కొన్ని గంటలు ఉన్నా కూడా నేరం జరగొచ్చని వ్యాఖ్యానించింది.