
Sunil Gavaskar: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో చివరి 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన టీమిండియా.. ఈరోజు బ్యాటింగ్ లో తడబడింది. ఆసీస్ బౌలర్ల దాటికి భారత్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. కేవలం 241 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి జట్టు ముందుంచారు. ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై భారీ స్కోరు సాధించిన రోహిత్.. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 240 పరుగులు మాత్రమే చేసింది. దీనిపై గ్రేట్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.
Read Also: Shraddha Das: గోల్డ్ కలర్ శారీలో సెగలు రేపుతున్న శ్రద్దా దాస్
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా విఫలమయ్యారని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ ఓ తప్పుడు షాట్ ఆడి అవుట్ కావడం పెద్దదెబ్బ అన్నారు. ఆ ఓవర్లో అప్పటికే ఒక సిక్స్, ఒక ఫోర్ తో కలిపి 10 పరుగులు వచ్చాయి. అంతటితో ఆగి ఉంటే సరిపోయేది.. కానీ మళ్లీ అలాంటి షాట్ ఆడి ఫీల్డర్ కు చిక్కాడని అభిప్రాయపడ్డాడు.
Read Also: Karthika Nayar: ఘనంగా ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి.. స్పెషల్ ఎట్రాక్షన్ గా చిరంజీవి